Search
Close this search box.

  అనిమల్ 2 కంటే ముందే రణబీర్ మాస్ ట్రీట్..!

September 25, 2026 7:48 AM | Aditya369 News

అనిమల్ 2 కంటే ముందే రణబీర్ మాస్ ట్రీట్..!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. రణబీర్ నటిస్తున్న భారీ విజువల్ ట్రీట్ ‘రామాయణ’ ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత ‘రామాయణ పార్ట్ 2’, అలాగే ‘అనిమల్ పార్ట్ 2’ సినిమాలు కూడా లైనప్‌లో ఉన్నాయి.

అయితే ఈ సినిమాల మధ్యలోనే రణబీర్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘లవ్ అండ్ వార్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అనిమల్‌లో రణబీర్‌ను మాస్ యాంగిల్‌లో చూసిన ఫ్యాన్స్.. మళ్లీ అలాంటి ట్రీట్ అనిమల్ 2లోనే ఉంటుందని భావించారు. కానీ ‘లవ్ అండ్ వార్’ పోస్టర్ చూస్తే భన్సాలీ రణబీర్‌ను మరో డిఫరెంట్ షేడ్స్‌లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

చేతికి గాయంతో, కారులో సీరియస్ లుక్‌లో యాటిట్యూడ్ చూపిస్తున్న రణబీర్ లుక్ ఫ్యాన్స్‌కు సూపర్ కిక్ ఇస్తోంది. సాధారణంగా తన పీరియాడిక్, హిస్టారికల్ సినిమాలతో ప్రత్యేకమైన విజువల్స్ చూపించే భన్సాలీ.. ఈసారి డిఫరెంట్ జానర్‌లో రణబీర్‌ను ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడనేది ఆసక్తిగా మారింది.

మొత్తానికి ‘అనిమల్ 2’ కంటే ముందే రణబీర్ మరో మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడనే అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో ఆలియా భట్, విక్కీ కౌశల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు