Search
Close this search box.

  హైప్ పెంచుతున్న “ఓజీ”..! ఇక థియేటర్లో విధ్వంసమే..!

మెగా, పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా “ఓజీ” మూవీ టీమ్ అభిమానులకు సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేసి, ఫ్యాన్స్ ఉత్సాహాన్ని మరింత పెంచింది.

“HBD OG – LOVE OMI” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ గ్లింప్స్‌లో పవన్ కళ్యాణ్ మాస్ లుక్ అదరగొట్టింది. విలన్ వాయిస్ ఓవర్ –

“డియర్ OG… నిన్ను కలవాలని, మాట్లాడాలని, చంపాలని ఎదురుచూస్తున్నా… నీ ఓమీ”

అని చెబుతుండగా, చివర్లో పవన్ వైట్ షర్ట్, తల్వార్‌తో ఇచ్చిన లుక్ ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఈ గ్లింప్స్‌తో సోషల్ మీడియాలో సంబరాలు మిన్నంటాయి. అభిమానులు దర్శకుడు సుజీత్‌ను ప్రశంసిస్తూ – “పవర్ స్టార్ బర్త్‌డేకి పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చావ్” అని ట్రెండ్ చేస్తున్నారు.

ముంబై గ్యాంగ్‌స్టర్ కథ

సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ముంబై గ్యాంగ్‌స్టర్ నేపథ్యంతో తెరకెక్కుతోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. గ్లింప్స్ ద్వారా ఆయన “ఓమీ” అనే విలన్ పాత్రలో కనువిందు చేయబోతున్నారని స్పష్టమైంది. పవన్ మరియు ఇమ్రాన్ మధ్య యాక్షన్ సీక్వెన్సులు బిగ్ స్క్రీన్‌పై విజువల్ ఫీస్ట్‌గా ఉండబోతున్నాయన్న అంచనాలు ఊపందుకున్నాయి.

హైప్ పెంచుతున్న “ఓజీ”

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై హైప్‌ను రెట్టింపు చేశాయి. తాజాగా విడుదలైన గ్లింప్స్ ఆ క్రేజ్‌ను మరింత పెంచింది. అభిమానులు సోషల్ మీడియాలో –

“సెప్టెంబర్ 25న బ్లాక్‌బస్టర్ బోమ్మ రాబోతోంది!”

అని హడావిడి చేస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 1970ల కాలం బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో పవన్ ఒక పవర్‌ఫుల్ ముంబై గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు