‘పెద్ది’ రిలీజ్‌కు మరో వారం రోజులు మాత్రమే ఉండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచేసింది. ఇప్పటికే భోపాల్, బెంగళూరు నగరాల్లో భారీ ఈవెంట్స్ నిర్వహించిన మేకర్స్.. తాజాగా ఢిల్లీలో గ్రాండ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్లో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో పాటు.. అభిమానులకు ఒక సూపర్ సర్ప్రైజ్ కూడా ఇచ్చారు.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘మస్సా మస్సా’ అనే ఇన్స్పిరేషనల్ అండ్ ఎనర్జిటిక్ ట్రాక్‌ను ఈ ప్రెస్ మీట్లో విడుదల చేశారు. పాట విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ రావడం విశేషం. ముఖ్యంగా రామ్ చరణ్ స్టైలిష్ డ్యాన్స్ మూమెంట్స్, స్క్రీన్ ప్రెజెన్స్ చూసి మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
‘మస్సా మస్సా’పై నార్త్ vs సౌత్ డిబేట్!
ఈ పాట విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ డిబేట్ మొదలైంది. తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్లో వచ్చిన ‘మస్సా మస్సా’ సాంగ్ మరింత పవర్‌ఫుల్‌గా ఉందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో నార్త్ vs సౌత్ వెర్షన్స్‌పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
మోదీతో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్న చరణ్
ప్రెస్ మీట్లో పాల్గొన్న రామ్ చరణ్.. ‘పెద్ది’ కథ గురించి మాట్లాడుతూ ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన సమయంలో ఈ సినిమా స్టోరీ లైన్ గురించి ఆయన అడిగారని తెలిపారు.
“ఈ సినిమా ఒక రకంగా వికసిత్ భారత్ ఆలోచనను ప్రతిబింబించే కథ” అని తాను చెప్పినట్లు చరణ్ వెల్లడించారు. ఆ సమయంలో పశ్చిమ బెంగాల్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన మహ్మద్ అనే ఫుట్‌బాల్ ప్లేయర్ కథను మోదీ తనకు చెప్పారని తెలిపారు.
ఒకే ఒక్క వ్యక్తి విజయం వల్ల ఆ గ్రామం నుంచి ఇప్పుడు 85 మందికి పైగా ఫుట్‌బాల్ ప్లేయర్లు దేశం తరఫున ఆడుతున్నారని.. సమాజంలో ఒక వ్యక్తి ఎంతటి మార్పు తీసుకురాగలడో ఆ కథ చెబుతుందని అన్నారు. ‘పెద్ది’ సినిమాలో తన పాత్ర కూడా అలాంటి స్ఫూర్తినే అందిస్తుందని చరణ్ చెప్పారు.
రెమ్యునరేషన్‌పై చరణ్ ఫన్నీ కామెంట్!
సినిమాలో తన డ్యాన్స్ అంత ఎనర్జిటిక్‌గా ఎలా వచ్చిందని మీడియా అడగగా.. “ప్రొడ్యూసర్స్ భారీ రెమ్యునరేషన్ ఇచ్చారు కాబట్టి” అంటూ చరణ్ సరదాగా సమాధానం ఇచ్చి అందరినీ నవ్వించారు.
జాన్వీ కామెంట్స్ వైరల్
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ‘దేవర’ తర్వాత ఆమె చేస్తున్న రెండో తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.
చరణ్ గురించి మాట్లాడుతూ.. “స్క్రీన్‌పై కనిపించే చరణ్‌కు, బయట ఉండే చరణ్‌కు చాలా తేడా ఉంటుంది. రియల్ లైఫ్‌లో ఆయన చాలా కూల్ పర్సన్” అంటూ జాన్వీ ప్రశంసించింది. అలాగే లెజెండరీ నటుడు బొమన్ ఇరానీతో కలిసి పనిచేయడం తన కల అని, ఈ సినిమాతో అది నెరవేరిందని చెప్పింది.
‘పెద్ది’లో టాక్సిక్ లవ్ స్టోరీ?
ఇక ‘మిర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ ఈ ప్రెస్ మీట్లో ఒక క్రేజీ లీక్ ఇచ్చారు. ఈ సినిమాలో కేవలం స్పోర్ట్స్, యాక్షన్ మాత్రమే కాకుండా.. ఒక టాక్సిక్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కూడా ఉందని హింట్ ఇచ్చారు.
రామ్ చరణ్ – జాన్వీ మధ్య అందమైన ప్రేమకథ ఉండగా.. తనకు, చరణ్‌కు మధ్య కూడా ఒక విభిన్నమైన ఎమోషనల్ కనెక్షన్ ఉంటుందని పేర్కొన్నారు.
కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘రంగస్థలం’ తరహాలో మరోసారి రామ్ చరణ్ కెరీర్లో ఈ సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు నమ్మకంగా ఎదురుచూస్తున్నారు.









