టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు వరుస బ్లాక్బస్టర్లతో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా దూసుకెళ్లిన పూజా… గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తోంది. అయితే సినిమాల కంటే ఇప్పుడు ఆమె పర్సనల్ లైఫ్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఓ బాలీవుడ్ నటుడితో రిలేషన్లో ఉందన్న వార్తలు ఇప్పటికే వైరల్ అవుతుండగా… తాజాగా సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుందంటూ మరో గాసిప్ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది.
ఇటీవల పూజా తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు ఈ రూమర్స్‌కు కారణమైంది. ఆ వీడియోలో ఆమె చేతికి కనిపించిన రింగ్‌ను చూసి… నెటిజన్స్ “బుట్టబొమ్మ సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుందా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ వార్త ఒక్కసారిగా వైరల్ అయింది. అయితే దీనిపై ఇప్పటివరకు పూజా హెగ్డే ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఇక పూజా పేరు బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రా తో గత కొన్ని రోజులుగా బలంగా వినిపిస్తోంది. ఇద్దరూ కలిసి పలు రెస్టారెంట్లు, ఫంక్షన్లలో కనిపించడం… కామన్ ఫ్రెండ్స్ ద్వారా దగ్గరయ్యారన్న వార్తలు రావడం… ఇప్పుడు ఈ రిలేషన్షిప్ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చాయి. అయితే వీరిద్దరూ తమ రిలేషన్‌పై ఎక్కడా ఓపెన్‌గా మాట్లాడలేదు.
ఇదిలా ఉంటే… సినిమాల పరంగా కూడా పూజా మళ్లీ బిజీ అవుతోంది. బాలీవుడ్లో వరుణ్ ధవన్ సరసన నటించిన ‘హై జవానీతో ఇష్క్ హోనా హై’ మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ తో ఓ సినిమా చేస్తుండగా… తమిళ స్టార్ విజయ్ సరసన నటించిన జన నాయగన్ కూడా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. వీటితో పాటు మరో రెండు భారీ ప్రాజెక్ట్స్‌కు కూడా పూజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే… పూజా నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకుందా? లేక ఇది కూడా సోషల్ మీడియా క్రియేట్ చేసిన మరో రూమరా? అనే విషయం క్లారిటీ రావాల్సి ఉంది.








