Search
Close this search box.

  చిరు,పవన్, చరణ్ ఒకే స్టేజ్‌పై.. మెగా అభిమానులకు పండగే..!

May 20, 2026 11:36 PM | Aditya369 News

చిరు,పవన్, చరణ్ ఒకే స్టేజ్‌పై.. మెగా అభిమానులకు పండగే..!

మెగాస్టార్ చిరంజీవి – మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. ‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ బ్లాక్‌బస్టర్ జోడీ ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ‘మెగా 158’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ మూవీ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.

రేపు, మే 21 ఉదయం 8 గంటల నుంచి ఈ సినిమా పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. అయితే ఈ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరుకానుండటం అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. తండ్రి కొత్త సినిమా ప్రారంభోత్సవానికి చరణ్ ముఖ్య అతిథిగా రానుండటంతో మెగా ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ వేడుకను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల కోసం ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో ఇప్పటికే #Mega158 హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సంగీత బాధ్యతలను థమన్ తీసుకోగా, సినిమాటోగ్రఫీని విజయ్ కార్తీక్ అందిస్తున్నారు. ఎడిటర్‌గా ఆంటోనీ ఎల్. రూబెన్, ఆర్ట్ డైరెక్టర్‌గా ఎ.ఎస్. ప్రకాష్ పనిచేస్తున్నారు.

టెక్నికల్‌గా కూడా చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా.. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి – బాబీ కాంబోలో మరో బాక్సాఫీస్ సెన్సేషన్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి మెగా అభిమానులకు మరో మాస్ ఫీస్ట్ రెడీ అవుతోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు