టాలీవుడ్‌లో ప్రతి దర్శకుడికి ఒక ప్రత్యేకమైన మార్క్ ఉంటుంది. వారు తెరకెక్కించే ప్రతి సినిమాలో ఆ స్టైల్ స్పష్టంగా కనిపిస్తుంది. అలానే సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కీ ఓ డార్క్, మాస్, హై ఎలివేషన్ స్టైల్ ఉంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాల్లో అదే టోన్ కనిపించింది. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ మూవీలో కూడా అదే నీల్ మార్క్ మరోసారి హైలెట్ అయింది.
ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ‘డ్రాగన్’ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. వీడియోలో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఎలివేషన్స్ ఫ్యాన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. అయితే మరోవైపు ప్రశాంత్ నీల్ స్టైల్‌పై మళ్లీ చర్చ మొదలైంది. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఎక్కువగా డార్క్ షేడ్స్, బ్లాక్ కాస్ట్యూమ్స్, స్మోకీ విజువల్స్ కనిపిస్తుంటాయి. ‘ఉగ్రం’ నుంచి ‘KGF’ వరకు అదే స్టైల్ ఫాలో అయిన నీల్.. ఇప్పుడు ‘డ్రాగన్’లో కూడా అదే విజువల్ టోన్ కొనసాగిస్తున్నట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.
ముఖ్యంగా ఎన్టీఆర్ ఇంట్రో షాట్స్‌లో హీరోని పూర్తిగా క్లియర్‌గా చూపించకుండా, హై ఎలివేషన్‌తో ప్రెజెంట్ చేయడం ఫ్యాన్స్‌లో హైప్ పెంచింది. అయితే కొంతమంది అభిమానులు మాత్రం “ఎన్టీఆర్‌ను కాస్త కలర్ఫుల్‌గా చూపిస్తే ఇంకా బాగుండేది” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయినప్పటికీ ఎక్కువ మంది ఫ్యాన్స్ మాత్రం ప్రశాంత్ నీల్ స్టైల్‌కు ఫిదా అవుతున్నారు.
ఇక ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోందని, దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయిందని సమాచారం. త్వరలో మిగిలిన భాగాన్ని పూర్తి చేసి మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.
గ్లింప్స్‌తోనే భారీ హైప్ క్రియేట్ చేసిన ‘డ్రాగన్’.. రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.







