సుకుమార్ పుష్ప సిరీస్ తో గ్లోబల్ లెవెల్లో క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు.. సుక్కు డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2. వరల్డ్ వైడ్ గా 1800 కోట్ల పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డులను క్రియేట్ చేసింది. దాంతో సుకుమార్ తీసే నెక్స్ట్ సినిమా పై సౌత్ తో పాటు, నార్త్ లో కూడా భారీ హైప్ ఉంది.. ఐతే సుకుమార్ తన నెక్స్ట్ సినిమాను రామ్ చరణ్ తో చేయబోతున్నట్లు గతంలోనే ప్రకటించారు సుకుమార్. పుష్ప 2 షూటింగ్లో ఉండగానే రామ్ చరణ్ కు కథ చెప్పాడు సుకుమార్. రామ్ చరణ్ కి కథ నచ్చడంతో సినిమా కూడా ఓకే చెప్పాడు..RRR సినిమా రామ్ చరణ్ సుక్కు తో సినిమా చెయ్యాలి. కానీ అప్పటికే సుకుమార్ పుష్ప సిరీస్ బిజీగా ఉండడం వల్ల వేరే సినిమాలకు కమిట్ అయ్యాడు చెర్రీ.. ఐతే గతంలో సుకుమార్ డైరెక్షన్లో చరణ్ చేసిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. రంగస్థలం సినిమా రిలీజ్ అయ్యి అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాగే అప్పటి వరకు రామ్ చరణ్ యాక్టింగ్ పై వచ్చిన విమర్శలు అన్నీ రంగస్థలం సినిమాతో సమాధానం చెప్పాడు చెర్రీ.. ఇక ఇప్పుడే రాబోయే సినిమా కూడా రంగస్థలాన్ని మించి ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది.. గతంలో ఓ ఇంటర్వ్యూ లో రాజమౌళి చరణ్ , సుకుమార్ సినిమా గురుంచి నాకు తెలుసు ఆ సినిమాలో వచ్చే చరణ్ ఇంట్రో సీన్ సిట్ ఏడ్జ్ పై కూర్చొని చూసేలా ఉంటుందని.. నేను ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్న అని జక్కన్న చెప్పడంతో సుకుమార్,చరణ్ కాంబో అంచనాలు భారీగా పెరిగాయి.. ఐతే ఈ సినిమా కోసం సుకుమార్ టీం తో కలిసి దుబాయ్ కి వెళ్తున్నాడు అనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రాష్మిక మందన్న ఉండబోతున్నట్లు సమాచారం.. చూడాలి మరి ఈసారి సుకుమార్ చెర్రీని ఏ రేంజిలో చూపిస్తాడో.









