Search
Close this search box.

  తెలంగాణ‌లోని గ్రూప్‌-1 అభ్య‌ర్థుల కోసం టీజీపీఎస్సీ కీల‌క ప్ర‌క‌ట‌న..

October 13, 2024 4:45 PM | Aditya369 News

తెలంగాణ‌లోని గ్రూప్‌-1 అభ్య‌ర్థుల కోసం టీజీపీఎస్సీ కీల‌క ప్ర‌క‌ట‌న..

తెలంగాణ‌లోని గ్రూప్‌-1 అభ్య‌ర్థుల కోసం టీజీపీఎస్సీ కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. రేప‌టి నుంచి గ్రూప్‌-1 విద్యార్థులు మెయిన్ పరీక్షలకు సంబంధించిన‌ హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. అభ్య‌ర్థులు త‌మ హాట్‌టెకెట్ల‌ను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పొందొచ్చ‌ని వెల్ల‌డించింది.

ఈ హాల్‌ టికెట్లను వెబ్‌సైట్‌లో విద్యార్థులు త‌మ వివ‌రాల‌ను న‌మోదు చేసి, డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని సూచించింది. ఈ ప‌రీక్ష‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్ప‌టికే క‌మిష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా హాల్‌టికెట్‌లకు సంబంధించిన ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది.

మొత్తం 563 గ్రూప్ 1 ఖాళీలకు..

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా తెలంగాణ‌లో మొత్తం 563 గ్రూప్ 1 ఖాళీలను భర్తీ చేయ‌నున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా మెయిన్స్‌ మొత్తం 7 పేపర్లకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌బోతున్నారు. ఇందుకోసం ఇప్ప‌టికే గ్రూప్‌-1 మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో త‌మ‌ వివరాలను నమోదు చేసి, హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

అలాగే, టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలకూ తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపింది. ఈ ప‌రీక్ష‌లు అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వ‌హించ‌నున్నారు. అభ్య‌ర్థులు హాల్‌టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకునే స‌మ‌యంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంట‌నే టోల్‌ఫ్రీ నంబర్‌ లేదా కమిషన్‌ అధికారులను సంప్రదించాల్సిందిగా కోరింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు