Search
Close this search box.

  నెలకు రూ.60 లక్షలా..? చరణ్ బాడీగార్డ్ రెమ్యునరేషన్ వైరల్..!

May 25, 2026 11:18 PM | Aditya369 News

నెలకు రూ.60 లక్షలా..? చరణ్ బాడీగార్డ్ రెమ్యునరేషన్ వైరల్..!

స్టార్ హీరోలు ఎక్కడ కనిపించినా అభిమానులు సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం ఎగబడటం ఇప్పుడు కామన్ అయిపోయింది. కానీ ఈ అభిమానావేశం మధ్య భద్రతా సమస్యలు కూడా దాగి ఉంటాయి. అందుకే టాప్ హీరోలు తమ వ్యక్తిగత రక్షణ కోసం ప్రత్యేక బాడీగార్డ్స్‌ను నియమించుకుంటుంటారు. అయితే ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తీసుకున్న సెక్యూరిటీ ఏర్పాట్లు మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

సాధారణంగా బాలీవుడ్ హీరోలు తమ పర్సనల్ బాడీగార్డ్స్‌కు భారీ పారితోషికాలే చెల్లిస్తుంటారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తన నమ్మకస్తుడు షేరాకు నెలకు సుమారు రూ.15 లక్షల వరకు చెల్లిస్తున్నాడని బీటౌన్ టాక్. అలాగే ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యష్ కూడా తన బాడీగార్డ్‌కు రూ.10 లక్షల వరకు ఇస్తున్నాడనే ప్రచారం ఉంది. కానీ వీరందరికంటే భిన్నంగా రామ్ చరణ్ మాత్రం ఓ ఇంటర్నేషనల్ ఫైటర్‌ను తన సెక్యూరిటీ కోసం రంగంలోకి దించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం చరణ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ నుంచి చరణ్ వెంట ఎప్పుడూ కనిపిస్తున్న ఓ భారీ కాయంతో ఉన్న ఆఫ్రికన్ బాడీగార్డ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రతి పబ్లిక్ ఈవెంట్‌లోనూ, ప్రెస్ మీట్‌లోనూ చరణ్‌కు నీడలా తిరుగుతున్న అతని గురించి ఇప్పుడు నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఆ వ్యక్తి పేరు కెవిన్ కుంట. ఆఫ్రికాలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్ సాధారణ బాడీగార్డ్ కాదు. అతను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రొఫెషనల్ MMA ఫైటర్. ఇటలీ మిడిల్ వెయిట్ ఛాంపియన్‌షిప్‌లో పలు రికార్డులు సొంతం చేసుకున్న కెవిన్.. రింగ్‌లో ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాడో, విఐపీ సెక్యూరిటీలో కూడా అంతే ప్రొఫెషనల్‌గా పనిచేస్తాడని చెబుతున్నారు. గ్లోబల్ రేంజ్ సెక్యూరిటీ కోసం వెతుకుతున్న సమయంలో చరణ్ టీమ్ అతన్ని ఎంపిక చేసినట్లు సమాచారం.

ఇక అసలు చర్చకు కారణం అతని రెమ్యునరేషన్. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. కెవిన్ కుంటకు రోజుకు సుమారు రూ.2 లక్షల వరకు చెల్లిస్తున్నారట. అంటే నెలకు దాదాపు రూ.60 లక్షల వరకు ఖర్చవుతున్నట్టు టాక్ నడుస్తోంది. ఒకవేళ ఈ వార్తల్లో నిజం ఉంటే మాత్రం.. భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న బాడీగార్డ్‌గా కెవిన్ రికార్డు సృష్టించే అవకాశముంది.

‘పెద్ది’ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉండటంతో పాటు, ప్రమోషన్ల సమయంలో ఎలాంటి భద్రతా లోపాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే చరణ్ ఈ హై లెవల్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ‘పెద్ది’ సినిమాతో పాటు ఈ ఇంటర్నేషనల్ బాడీగార్డ్ వ్యవహారం కూడా ఇప్పుడు రామ్ చరణ్ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్తోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు