Search
Close this search box.

  నా ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకోను: నెటిజన్లకు లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ వార్నింగ్!

February 12, 2026 9:42 PM | Aditya369 News

నా ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకోను: నెటిజన్లకు లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ వార్నింగ్!

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మార్చి 6న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో లావణ్య మాట్లాడుతూ.. గత కొద్దిరోజులుగా మెగా కుటుంబంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తన కుటుంబం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.
ఇటీవల రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కవలలు జన్మించిన శుభసమయంలో, మెగా ఫ్యామిలీలో వివక్ష ఉందంటూ కొందరు నెటిజన్లు చేసిన పోస్టులపై లావణ్య ఘాటుగా స్పందించారు. "అంతటి గొప్ప కుటుంబంలో భాగమవ్వడం నా అదృష్టం. మేమంతా సంతోషంగా ఉన్న సమయంలో ఎవరో తెలియని వ్యక్తి మా కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరం. మా మావయ్య చిరంజీవి గారు మహిళలను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడే స్థాయి వారికి లేదు" అని లావణ్య ఉద్వేగంగా వ్యాఖ్యానించారు.
సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే లావణ్య, ఈసారి మాత్రం వెనక్కి తగ్గకుండా సోషల్ మీడియాలో నెటిజన్లకు రిప్లై ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. "నా ఫ్యామిలీ జోలికి ఎవరు వచ్చినా నేను ఊరుకోను, అందుకే ఆ నెటిజన్ పోస్ట్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాను" అని ఆమె తన చర్యను సమర్థించుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండగా, మెగా అభిమానులు లావణ్య తెగింపును సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు.

లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సతీ లీలావతి’. తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మార్చి 6న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో లావణ్య మాట్లాడుతూ.. గత కొద్దిరోజులుగా మెగా కుటుంబంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తన కుటుంబం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు.

ఇటీవల రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కవలలు జన్మించిన శుభసమయంలో, మెగా ఫ్యామిలీలో వివక్ష ఉందంటూ కొందరు నెటిజన్లు చేసిన పోస్టులపై లావణ్య ఘాటుగా స్పందించారు. “అంతటి గొప్ప కుటుంబంలో భాగమవ్వడం నా అదృష్టం. మేమంతా సంతోషంగా ఉన్న సమయంలో ఎవరో తెలియని వ్యక్తి మా కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరం. మా మావయ్య చిరంజీవి గారు మహిళలను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడే స్థాయి వారికి లేదు” అని లావణ్య ఉద్వేగంగా వ్యాఖ్యానించారు.

సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే లావణ్య, ఈసారి మాత్రం వెనక్కి తగ్గకుండా సోషల్ మీడియాలో నెటిజన్లకు రిప్లై ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. “నా ఫ్యామిలీ జోలికి ఎవరు వచ్చినా నేను ఊరుకోను, అందుకే ఆ నెటిజన్ పోస్ట్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాను” అని ఆమె తన చర్యను సమర్థించుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతుండగా, మెగా అభిమానులు లావణ్య తెగింపును సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు