Search
Close this search box.

  గుడ్ మార్నింగ్ చిత్రాడ కార్యక్రమం

February 10, 2026 5:40 PM | Aditya369 News

గుడ్ మార్నింగ్ చిత్రాడ కార్యక్రమం

పిఠాపురం మండలం చిత్రాడ గ్రామం రాష్ట్ర డిసిఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పల్లెల్లో ఆరోగ్యకరమైన వాతావరణం పెంపొందించడమే లక్ష్యంగా గుడ్ మార్నింగ్ చిత్రాడ కార్యక్రమాన్ని జనసేన నాయకులు నిర్వహించారు.పార్టీ నాయకులు,కార్యకర్తలు ఇంటింటికి తిరిగి దోమల నివారణ,పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డిసిఎం పవన్ ఆకాంక్షించినట్లుగా అభివృద్ధి పల్లెల నుండే ప్రారంభం కావాలన్నారు.వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే గ్రామాన్ని రోగాల బారి నుండి రక్షించాలని పోలీస్,ఆరోగ్య శాఖల సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.ప్రతి గురు,శనివారాల్లో నిర్వహిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, గ్రామ పార్టీఇంచార్జి నంద్యాల జాన్, పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ నిమ్మన దుర్గ, ఎంపీటీసీ,వార్డు ఇన్చార్జిలు,బూతు కన్వీనర్లు,వైద్య ఆరోగ్య శాఖ,పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore