Search
Close this search box.

  రేణు దేశాయ్ పోస్ట్ పవన్ గురించేనా..?

November 10, 2026 11:16 PM | Aditya369 News

రేణు దేశాయ్ పోస్ట్ పవన్ గురించేనా..?

నటి రేణూ దేశాయ్ మరోసారి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌తో వార్తల్లో నిలిచారు. ఇటీవల దీపావళి సందర్భంగా అర్ధరాత్రి వరకు టపాసులు కాల్చడంపై తన అసహనం వ్యక్తం చేసిన ఆమె, తాజాగా మరో సామాజిక అంశంపై స్పందించారు. ఇతరుల కష్టాలను చూసి విమర్శించడం, వారిని మరింత బాధపెట్టడం సరైన పద్ధతి కాదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు వారిని నిందించడం సరికాదని రేణూ దేశాయ్ పేర్కొన్నారు. ఇప్పటికే కిందపడిపోయిన వారిని మరింత తొక్కడం అమానుషమని అన్నారు. వారు ఏ స్థాయిలో ఉన్నా మనుషులేనని, ఒక తల్లికి బిడ్డలని, మరికొందరికి తల్లిదండ్రులు, తోబుట్టువులని గుర్తు చేశారు. మనలో కూడా ఎన్నో లోపాలు ఉన్నప్పుడు ఇతరులపై రాళ్లు వేయడం మంచిది కాదని పేర్కొన్నారు. మనిషిగా మనలో దయ, జాలి, ఇతరుల పట్ల సానుభూతి ఉండాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అయితే ఈ పోస్ట్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడాకుల వార్తల నేపథ్యంలో రేణూ దేశాయ్ ఈ వ్యాఖ్యలు చేశారా? అంటూ కొందరు నెటిజన్లు ఊహాగానాలు మొదలుపెట్టారు. దీంతో ఈ విషయంపై కూడా ఆమె తన పోస్ట్‌లో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.

తాను ఏదైనా మాట్లాడినంత మాత్రాన దానికి వ్యక్తిగత సంబంధాలు అంటగట్టి అనవసరమైన ఊహాగానాలు చేయవద్దని కోరారు. ఒక సమాజంగా మనం మరింత బాధ్యతగా, సానుభూతితో ప్రవర్తించగలమని తాను నిజాయితీగా నమ్ముతున్నానని తెలిపారు. ఇతరుల పట్ల దయగా ఉండాలని చెప్పడానికి తనకు ఎవరూ డబ్బులు చెల్లించలేదని, తన ఆలోచనా శక్తి ఇంకా బాగానే పనిచేస్తోందని కూడా ఘాటుగా స్పందించారు.

మొత్తానికి రేణూ దేశాయ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆమె ఈ వ్యాఖ్యలు ఎవరినైనా ఉద్దేశించి చేశారనే దానిపై స్పష్టత లేదు. కేవలం ఒక సామాజిక సందేశంగా చేసిన పోస్ట్‌ను వ్యక్తిగత విషయాలతో ముడిపెట్టవద్దనే ఆమె అభిప్రాయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు