రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని చూస్తున్న టిడ్కో గృహాల లబ్ధిదారులకు గృహాలను అందించ నున్నారు. చంద్రబాబునాయుడు చేతుల మీదుగా గృహాలను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 300 చదరపు అడుగుల గృహాలు-54,934, 365చదరపు అడుగులవి – 16,223 ఇళ్లు, 430 చదరపు అడుగులవి-28,986 ఇళ్లను అందించేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు పెండింగ్ పనులు పూర్తి చేయడానికి, పాత బకాయిలను విడుదల చేసేందుకు సిద్ధమైంది.









