Search
Close this search box.

  ప్యారడైజ్ షాక్..! మాస్ నుంచి క్లాస్ కి నాని రూట్ మార్చుతున్నాడా..?

October 3, 2026 8:46 PM | Aditya369 News

ప్యారడైజ్ షాక్..! మాస్ నుంచి క్లాస్ కి నాని రూట్ మార్చుతున్నాడా..?

న్యాచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు మన పక్కింటి కుర్రాడిలా కనిపించే నేచురల్ క్యారెక్టర్లు గుర్తొచ్చేవి. కానీ గత కొంతకాలంగా నాని తన రూట్ పూర్తిగా మార్చేశాడు. ‘దసరా’, ‘సరిపోదా శనివారం’, ‘ది ప్యారడైజ్’ వంటి సినిమాలతో మాస్, యాక్షన్ జానర్‌లోకి అడుగుపెట్టి తన మార్కెట్‌ను మరింత పెంచుకున్నాడు.

ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ‘బ్లడీ రోమియో’ అనే యాక్షన్ కథలో నటిస్తున్న నాని.. ఇకపై వరుసగా మాస్ సినిమాలే చేయకుండా కాస్త రూట్ మార్చాలని చూస్తున్నాడట.

తన అభిమానుల నుంచి వస్తున్న సలహాలతో పాటు.. క్లాస్, ఫ్యామిలీ కథలకు కూడా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని నాని మళ్లీ తన పాత స్టైల్‌లోకి రావాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇందులో భాగంగా శివ నిర్వాణ, వెంకీ అట్లూరి వంటి క్లాస్ టచ్ ఉన్న కథలను తెరకెక్కించే దర్శకులతో నాని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, కామెడీతో కూడిన కథలపై నాని ఆసక్తి చూపిస్తున్నాడట.

అయితే పూర్తిగా యాక్షన్‌కు గుడ్‌బై చెప్పే ఆలోచన మాత్రం నానికి లేదని తెలుస్తోంది. కథ డిమాండ్ చేస్తే మాస్, యాక్షన్ సినిమాలు చేస్తూనే.. మధ్య మధ్యలో క్లాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లను కూడా బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నాడట.

మరి రాబోయే రోజుల్లో నాని మళ్లీ మన పక్కింటి కుర్రాడి తరహా పాత్రల్లో కనిపిస్తాడా? లేక మాస్ ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తాడా? అనేది చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore