Search
Close this search box.

  సంక్రాంతి బాలయ్య ‘దాదా’..?

October 2, 2026 11:21 PM | Aditya369 News

సంక్రాంతి బాలయ్య ‘దాదా’..?

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దాదా’ షూటింగ్‌కు సంబంధించిన కీలక అప్‌డేట్ ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తిని పెంచుతోంది.

ఇటీవల బాలకృష్ణ గాయపడటంతో ఈ సినిమా షూటింగ్‌కు కొంతకాలం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం బాలయ్య కోలుకుంటుండటంతో.. త్వరలోనే షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.
క్రిస్మస్‌కి బాలయ్య ‘దాదా’?
వచ్చే సంక్రాంతి రేసులో ఇప్పటికే పలు భారీ సినిమాలు పోటీలో ఉండటంతో.. ‘దాదా’ సినిమాను క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అందులో భాగంగానే దర్శకుడు గోపీచంద్ మలినేని బాలకృష్ణ లేని సన్నివేశాల షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా పూర్తి చేస్తున్నారట.

అయితే క్రిస్మస్ రిలీజ్ టార్గెట్‌ను అందుకోవాలంటే సినిమాకు ఇక కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో.. మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇందుకోసం బాలకృష్ణ కూడా రాబోయే రెండు నెలల పాటు వరుస షూటింగ్ షెడ్యూళ్లకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అటు చిత్రబృందం కూడా సినిమాను నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు అహోరాత్రులు పనిచేయాల్సిన పరిస్థితి.

వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

మరి బాలయ్య గాయంతో వచ్చిన బ్రేక్ తర్వాత షూటింగ్ ఎంత వేగంగా పూర్తవుతుంది? నిజంగానే ‘దాదా’ క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి వస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore