ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘రాకా’పై రోజుకో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తోంది. భారీ అంచనాలున్న ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే టాక్ ఉంది.
ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పలువురు స్టార్ హీరోయిన్లు కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. దీపికా పదుకొణె, రష్మిక మందన్నా, మృణాల్ ఠాకూర్ వంటి పేర్లు ఇప్పటికే వినిపిస్తున్నాయి.
అయితే వీరితో పాటు మరో ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కూడా ‘రాకా’లో భాగం కానుందంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై ఐశ్వర్య లక్ష్మి స్పందించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాను ‘రాకా’ సినిమాలో భాగం కాదని ఆమె క్లారిటీ ఇచ్చారు. అయితే తనను ఎవరైనా సినిమాలో చేర్చాలని సరదాగా ఫన్ రిప్లై ఇవ్వడం విశేషం. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఐశ్వర్య లక్ష్మి ఈ ప్రాజెక్ట్‌లో లేరనే విషయం స్పష్టమవుతోంది.
ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌కు సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. మరి అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ నుంచి ముందు ముందు ఎలాంటి అప్‌డేట్స్ వస్తాయో చూడాలి.








