Search
Close this search box.

  ‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ బిగ్ అప్డేట్..! ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే. !

September 25, 2026 9:24 PM | Aditya369 News

‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ బిగ్ అప్డేట్..! ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే. !

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘కల్కి 2898 AD’ ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘కల్కి 2’పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తన విజన్‌ను పూర్తిగా నమ్మి సపోర్ట్ చేసే ప్రభాస్ లాంటి సూపర్‌స్టార్ తనతో ఉండటం అదృష్టమని నాగ్ అశ్విన్ తెలిపారు. ఇక ‘కల్కి 2’ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుందని చెప్పారు.

అంతేకాదు.. 2027 జూన్ నాటికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు వెల్లడించారు.

ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే సీక్వెల్‌ను మరింత భారీ స్కేల్‌లో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించబోతున్నట్లు నాగ్ అశ్విన్ తెలిపారు.

అయితే ఈసారి కేవలం విజువల్స్, యాక్షన్ మాత్రమే కాకుండా.. కథలోని ఎమోషన్స్‌కు కూడా మరింత ప్రాధాన్యత ఇవ్వబోతున్నారట.

మరి ‘కల్కి 2898 AD’ను మించిన స్థాయిలో ‘కల్కి 2’ ఏ రేంజ్‌లో ఉండబోతుందో చూడాలి!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore