Search
Close this search box.

  జెట్ స్పీడ్ లో జక్కన్న..! ‘వారణాసి’ షూటింగ్ కంప్లీట్..?

September 25, 2026 8:02 AM | Aditya369 News

జెట్ స్పీడ్ లో జక్కన్న..! ‘వారణాసి’ షూటింగ్ కంప్లీట్..?

రాజమౌళి సినిమా అంటేనే భారీ స్కేల్.. భారీ బడ్జెట్.. అలాగే ఏళ్ల తరబడి కొనసాగే షూటింగ్ గుర్తొస్తుంది. కానీ ఈసారి మాత్రం జక్కన్న తన స్పీడ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు సమాచారం. మహేష్ బాబు‌కు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ కావడంతో.. ప్యాచ్ వర్క్ మినహా సినిమా మొత్తం చిత్రీకరణ పూర్తి చేసే దశకు చేరుకుందని తెలుస్తోంది.

‘వారణాసి’ షూటింగ్ గత ఏడాది జనవరి 24న ప్రారంభమై.. ఈ ఏడాది సెప్టెంబర్ 22న పూర్తయిందని సమాచారం. అంటే దాదాపు 606 రోజుల్లో షూటింగ్‌ను పూర్తి చేశారు. ఇదే రాజమౌళి గత చిత్రం ‘ఆర్ఆర్ఆర్’తో పోలిస్తే చాలా తక్కువ సమయం.

‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌కు దాదాపు 1011 రోజులు పట్టింది. అయితే అందుకు కరోనా మహమ్మారి కారణంగా వచ్చిన భారీ బ్రేకులు కూడా ప్రధాన కారణం. కానీ ‘వారణాసి’ విషయంలో అలాంటి పరిస్థితులు ఎదురుకాకపోవడంతో షూటింగ్ అనుకున్న ప్లాన్ ప్రకారం ముందుకు సాగిందని తెలుస్తోంది.

మరోవైపు వచ్చే ఏడాది ఏప్రిల్ రిలీజ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదనే టార్గెట్‌తో రాజమౌళి టీమ్ ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. షూటింగ్‌తో పాటు వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా సమాంతరంగా పూర్తి చేస్తూ.. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా జక్కన్న స్వయంగా పర్యవేక్షిస్తున్నారట.

ఇక ఈ విజువల్ గ్రాండియర్‌కు సంబంధించిన ప్రమోషన్స్‌ను డిసెంబర్ నుంచి మరింత భారీగా ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని భాషల్లో ఒకే స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించేలా ప్రత్యేక ప్లాన్ సిద్ధం చేస్తున్నారట.

మహేష్ బాబు షూటింగ్ పూర్తవడంతో ‘వారణాసి’కి ఇప్పుడు రూట్ క్లియర్ అయినట్టే అని చెప్పొచ్చు. పలు అంతర్జాతీయ స్టూడియోలు వీఎఫ్ఎక్స్‌పై పనిచేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్.. ఏప్రిల్ రిలీజ్ కోసం ప్రస్తుతం ఫుల్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore