కోలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ తన సూపర్ హిట్ హారర్ ఫ్రాంచైజీ ‘కాంచన’ నుంచి నాలుగో భాగంగా ‘కాంచన 4’ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ తర్వాత మొదలైన ఈ ప్రాజెక్ట్‌పై మొదట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
గతంలో ఈ ఫ్రాంచైజీలో వచ్చిన సినిమాలు మంచి విజయాలు సాధించడంతో.. ఈసారి మరింత భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కించేందుకు మేకర్స్ పూజా హెగ్డే, నోరా ఫతేహి, నయనతార వంటి క్రేజీ స్టార్స్‌ను ప్రాజెక్ట్‌లో భాగం చేశారు.
అయితే ఇప్పుడు ‘కాంచన 4’కు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. షూటింగ్ ప్రారంభమై దాదాపు రెండేళ్లు పూర్తయినా.. ఇంకా సుమారు 80 రోజుల షూటింగ్ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.
ఇంత భారీగా షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమా బడ్జెట్ కూడా అంచనాలకు మించి పెరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో నిర్మాతలపై ఆర్థిక భారం కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు వచ్చే వేసవి నాటికి కూడా ‘కాంచన 4’ థియేటర్లలోకి రావడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా ఫ్రాంచైజీ క్రేజ్‌ను మాత్రమే నమ్ముకోకుండా.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే కథ, ట్రీట్‌మెంట్‌తో వస్తేనే ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఉన్న రిస్క్‌ను మేకర్స్ అధిగమించే అవకాశం ఉంటుంది.
మరి ఇంత ఆలస్యానికి అసలు కారణమేంటి? ‘కాంచన 4’ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది? అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.









