‘సీతా రామం’, ‘హాయ్ నాన్న’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ఇటీవల తన క్లోజ్ ఫ్రెండ్ విదుషి పరాశర్ వివాహ వేడుకకు హాజరైన మృణాల్.. అక్కడ తనదైన స్టైల్లో సందడి చేశారు. పెళ్లి రిసెప్షన్లో ఆమె చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రిసెప్షన్లో దిల్జిత్ దోసాంజ్ పాడిన ప్రముఖ పాట ‘లవర్’కు మృణాల్ ఎంతో ఉత్సాహంగా, గ్రేస్‌ఫుల్‌గా డ్యాన్స్ చేశారు. ఆమె వేసిన స్టెప్పులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోను చూసిన అభిమానులు మృణాల్ డ్యాన్స్‌పై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. మృణాల్ ఠాకూర్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘సీతా రామం’తో క్లాసిక్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆమె.. ‘హాయ్ నాన్న’తో ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.








