Search
Close this search box.

  బాలయ్య బర్త్‌డేకు డబుల్ ధమాకా..! రెండు సినిమాల నుంచి భారీ అప్‌డేట్స్..!

June 1, 2026 11:52 AM | Aditya369 News

బాలయ్య బర్త్‌డేకు డబుల్ ధమాకా..! రెండు సినిమాల నుంచి భారీ అప్‌డేట్స్..!

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంటోంది. ప్రతి ఏడాది బాలయ్య బర్త్‌డే సందర్భంగా స్పెషల్ అప్‌డేట్స్ కోసం ఎదురుచూసే ఫ్యాన్స్‌కు ఈసారి మాత్రం డబుల్ ధమాకా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒకటి కాదు, రెండు భారీ ప్రాజెక్టుల నుంచి వరుస సర్ప్రైజ్‌లు రానుండటంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్న NBK111 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ‘వీరసింహారెడ్డి’ తర్వాత మరోసారి ఈ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటం సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఈ చిత్రంలో మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం కూడా ఆసక్తిని పెంచుతోంది. ఇప్పుడు బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

మరోవైపు, ఇటీవల అధికారికంగా ప్రకటించిన బాలకృష్ణ – కొరటాల శివ కాంబినేషన్ ప్రాజెక్ట్ NBK112 నుంచి కూడా ఒక బిగ్ అప్‌డేట్ రానుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన సందేశాన్ని అందించే కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే కొరటాల శివ, బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా ఓ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా రివీల్ చేయనున్నారట. దీంతో NBK112 టైటిల్ ఏమై ఉంటుందో అనే ఆసక్తి అభిమానుల్లో రోజురోజుకూ పెరుగుతోంది.

మొత్తానికి ఒకవైపు NBK111 నుంచి మాస్ గ్లింప్స్, మరోవైపు NBK112 టైటిల్ అనౌన్స్‌మెంట్.. ఇలా రెండు భారీ అప్‌డేట్స్‌తో బాలయ్య బర్త్‌డే ఈసారి నందమూరి అభిమానులకు పండగలా మారబోతోందని చెప్పాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు