టాలీవుడ్లో ప్రస్తుతం నారా రోహిత్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన వార్తలు అందుకుంటున్న ఆయన, మరోవైపు కెరీర్లో కూడా వరుసగా క్రేజీ అవకాశాలను దక్కించుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోల భారీ ప్రాజెక్టుల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారనే వార్తలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుతం విక్టరీ వెంకటేశ్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’ చిత్రంలో నారా రోహిత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా, ఇప్పటికే రోహిత్‌పై పలు ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్‌కే ప్రత్యేక గుర్తింపు దక్కుతుండటంతో, రోహిత్ పాత్రపై కూడా ఆసక్తి పెరుగుతోంది.
ఇదిలా ఉంటే, మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ చిత్రం ‘మెగా158’లో కూడా నారా రోహిత్ కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజా బజ్ ప్రకారం, ‘మెగా158’ సెకండాఫ్‌లో వచ్చే అత్యంత కీలకమైన పాత్ర కోసం పలువురు నటుల పేర్లను పరిశీలించిన దర్శకుడు బాబీ, చివరికి నారా రోహిత్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కథలో ఈ పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండటంతో, రోహిత్ ఎంట్రీ సినిమాకు మరో హైలైట్‌గా నిలవొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే, వెంకటేశ్-త్రివిక్రమ్ సినిమా, చిరంజీవి-బాబీ సినిమా.. ఇలా బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ ప్రాజెక్టుల్లో రోహిత్ కనిపించడం ఆయన కెరీర్‌కు పెద్ద బూస్ట్ అవుతుంది.
ఇక వ్యక్తిగత జీవితంలో కూడా నారా రోహిత్ ప్రస్తుతం ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్నారు. ఆయన భార్య సిరి గర్భవతిగా ఉండగా, ఇటీవల నిర్వహించిన సీమంత వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొత్తంగా చూస్తే కెరీర్ పరంగా, వ్యక్తిగత జీవిత పరంగా నారా రోహిత్ ప్రస్తుతం తన జీవితంలోని అత్యుత్తమ దశను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.









