టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో డింపుల్ హయాతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో శర్వానంద్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సాధారణంగా ప్రతి సినిమా విడుదలకు ముందు కొంత ఒత్తిడి ఉంటుందని, కానీ ‘భోగి’ విషయంలో తనకు ఎలాంటి ఒత్తిడి, భయం లేవని తెలిపారు. సినిమా ఫస్ట్ కాపీ చూసినప్పుడే ఎంతో సంతృప్తి కలిగిందని, ప్రేక్షకులను కూడా ఈ చిత్రం తప్పకుండా సంతృప్తిపరుస్తుందనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సినిమాతో నటుడిగా తనలోని మరో కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న దర్శకుడు సంపత్ నందికి శర్వానంద్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘భోగి’ తన కెరీర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శర్వానంద్ వ్యాఖ్యలతో సినిమాపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.








