తెలుగు సినిమాలు, స్పెషల్ సాంగ్స్‌పై కొందరు తమిళ జర్నలిస్టులు చేస్తున్న వ్యాఖ్యలు తరచూ చర్చకు దారితీస్తున్నాయి. తాజాగా రామ్ చరణ్ నటిస్తున్న క్రేజీ మూవీ ‘పెద్ది’లో శృతి హాసన్ చేసిన స్పెషల్ సాంగ్, ఆమె డ్రెస్సింగ్‌పై ఓ తమిళ జర్నలిస్ట్ ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. గతంలో ఇదే సినిమా విషయంలో జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈ ప్రశ్నకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.
ఓ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ శృతి హాసన్‌ను ఉద్దేశించి.. ‘పెద్ది’ సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్‌ను ఎలా చూస్తారని, ఇలాంటి పాటలను గ్లామర్ కోసమే ప్రత్యేకంగా రూపొందిస్తారని తనకు తెలుసు కదా అంటూ ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నకు శృతి ఏమాత్రం తడబడకుండా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తనకు డ్యాన్స్ చేయడం, అందంగా ముస్తాబవడం ఎంతో ఇష్టమని స్పష్టం చేశారు.
ఈ పాటను కూడా తాను అదే కోణంలో చూస్తానని శృతి హాసన్ తెలిపారు. గ్లామర్ విషయంలో తన ఆలోచనా విధానం తనకు ఎంతో స్వేచ్ఛను ఇస్తుందని పేర్కొన్నారు. దీంతో ఆమె సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పెషల్ సాంగ్స్, గ్లామర్‌పై తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించడంతో నెటిజన్లు ఈ వ్యాఖ్యలపై చర్చించుకుంటున్నారు.








