Search
Close this search box.

  మెగాస్టార్ ‘కాకా’లో బాలీవుడ్ స్టార్..!

October 5, 2026 9:40 PM | Aditya369 News

మెగాస్టార్ ‘కాకా’లో బాలీవుడ్ స్టార్..!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

ఇక ఇప్పుడు ఈ సినిమాలోకి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఎంట్రీ ఇచ్చారు. సినిమాలో ఆయన ఓ కీలకమైన, పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, తాజాగా హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో అనురాగ్ కశ్యప్ కూడా జాయిన్ అయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి, అనురాగ్ కశ్యప్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ది వరల్డ్ ఆఫ్ కాకా జస్ట్ గాట్ డెడ్లియర్’ అంటూ మేకర్స్ చేసిన ప్రకటన కూడా ఈ పాత్రపై క్యూరియాసిటీని పెంచేసింది.

ఇప్పటికే చిరంజీవి పుట్టినరోజున విడుదలైన టైటిల్ గ్లింప్స్ మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అనశ్వర రాజన్‌తో పాటు మరికొందరు ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారు.

కేవీఎన్ ప్రొడక్షన్స్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇక ఈ సినిమాను 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మొత్తానికి అనురాగ్ కశ్యప్ ఎంట్రీతో ‘కాకా’ సినిమా మరింత క్రేజీగా మారిందనే చెప్పాలి!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు