బాలీవుడ్లో తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కించే స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఇప్పుడు టాలీవుడ్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలుగులో ఓ టాప్ హీరోతో భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నారనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
గతంలో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలతో భన్సాలీ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబును భన్సాలీ కలిశారని, ఆయనకు ఓ కథను కూడా వినిపించినట్లు సమాచారం.
అయితే ప్రస్తుతం మహేష్ బాబు పూర్తిగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాపైనే ఫోకస్ పెట్టారు. ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు మహేష్ తన తదుపరి సినిమాను ఫైనల్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది.
దీంతో సంజయ్ లీలా భన్సాలీ చెప్పిన కథ మహేష్‌కు నచ్చిందా? వీరిద్దరి కాంబినేషన్లో సినిమా నిజంగానే సెట్ అవుతుందా? అనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికి ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి మహేష్–భన్సాలీ కాంబినేషన్‌పై క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.








