టాలీవుడ్లో స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్‌కు సరికొత్త గుర్తింపు తీసుకొచ్చిన ‘గూఢచారి’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘G2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా రిలీజ్ డేట్‌పై ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘G2’ సినిమాను ఫిబ్రవరి 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా చివరి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ చిత్రబృందం నుంచి ఓ స్పెషల్ పోస్టర్ కూడా విడుదల కానున్నట్లు సమాచారం.
భారీ యాక్షన్, స్పై థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాలో ఇమ్రాన్ హష్మి, వామికా గబ్బి, మధు శాలిని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మరి ‘గూఢచారి’కి కొనసాగింపుగా వస్తున్న ‘G2’ అడివి శేష్ కెరీర్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.








