Search
Close this search box.

  నిఖిల్ ‘స్వయంభు’ రిలీజ్‌పై క్రేజీ అప్డేట్..!

September 9, 2026 11:39 PM | Aditya369 News

నిఖిల్ ‘స్వయంభు’ రిలీజ్‌పై క్రేజీ అప్డేట్..!

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా రిలీజ్ కొంత ఆలస్యమైంది. అయితే ఈ సినిమా 2026లో విడుదల కాదంటూ వస్తున్న వార్తలను చిత్ర బృందం తాజాగా ఖండించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ‘స్వయంభు’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సోలో రిలీజ్‌గా తీసుకురావడానికి సరైన తేదీ కోసం నిర్మాతలు కసరత్తు చేస్తున్నారట.

ఇదే సమయంలో అక్టోబర్ 15, 16 తేదీల్లో ఇతర భారీ చిత్రాలు థియేటర్లలోకి రానుండటంతో.. థియేటర్ల కొరత రాకుండా ‘స్వయంభు’కు అనువైన రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాకు కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్, భారీ యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్‌తో ఈ సినిమా నిఖిల్ కెరీర్‌లోనే మరో ప్రత్యేక చిత్రంగా నిలవబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇక ‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాన్ని అందుకున్న నిఖిల్.. ‘స్వయంభు’తో మరోసారి దేశవ్యాప్తంగా తన మార్కెట్‌ను పెంచుకోవాలని చూస్తున్నారు.

మరోవైపు ‘స్వయంభు’ విడుదల పూర్తయిన వెంటనే తన తదుపరి ప్రాజెక్టులపై నిఖిల్ ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అంచనాలు పెంచుతున్న ‘ది ఇండియా హౌస్’, అలాగే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కార్తికేయ 3’ సినిమాల షూటింగ్స్‌ను వేగవంతం చేయాలని నిఖిల్ ప్లాన్ చేస్తున్నారట.

మొత్తానికి ‘స్వయంభు’ 2026లోనే థియేటర్లలోకి రాబోతుందనే వార్త నిఖిల్ అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore