నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఎప్పటి నుంచో కొనసాగుతున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడినట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తూ ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ‘బింబిసార’, ‘విశ్వంభర’ వంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను భారీ స్థాయిలో నిర్మించబోతోంది.
ఇక మోక్షజ్ఞకు జోడీగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటించనున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ విషయంలో ఆమెతో సంప్రదింపులు దాదాపు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం.
ఈ సినిమాను గ్రాండ్‌గా ప్రారంభించేందుకు మేకర్స్ ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టారట. దసరా పండుగ సందర్భంగా ప్రాజెక్ట్‌ను అధికారికంగా లాంచ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2027 వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారట.
మరోవైపు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కావడంతో నందమూరి బాలకృష్ణ కూడా ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. సినిమా పనులను స్వయంగా పర్యవేక్షిస్తూ తన కుమారుడి ఎంట్రీని ఎంతో గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారట.
అంతేకాదు.. మోక్షజ్ఞ మొదటి సినిమాలోనే బాలకృష్ణ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించే అవకాశం ఉందనే వార్తలు కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. తండ్రి–కొడుకులను ఒకే తెరపై చూడాలని నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్న నేపథ్యంలో ఈ వార్త నిజమైతే సినిమాపై హైప్ మరింత పెరగడం ఖాయం.
ఇక మోక్షజ్ఞ కూడా తన డెబ్యూ కోసం గత ఏడాది కాలంగా ప్రత్యేకంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బరువు తగ్గడంతో పాటు సరికొత్త లుక్‌ను మెయింటైన్ చేస్తూ పూర్తిగా కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడట.
మొత్తానికి బాలయ్య వారసుడిగా మోక్షజ్ఞ ఎలాంటి ఇమేజ్‌తో ఎంట్రీ ఇస్తాడు? వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా నందమూరి అభిమానుల అంచనాలను ఏ స్థాయిలో అందుకుంటుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








