Search
Close this search box.

  ది ప్యారడైజ్ షూటింగ్ కంప్లీట్..! అడ్వాన్స్ బుకింగ్స్‌లో రచ్చ..!

September 10, 2026 10:23 PM | Aditya369 News

ది ప్యారడైజ్ షూటింగ్ కంప్లీట్..! అడ్వాన్స్ బుకింగ్స్‌లో రచ్చ..!

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ షూటింగ్ ఎట్టకేలకు పూర్తయింది. నాని, కయాదు లోహార్‌పై చిత్రీకరించిన చివరి పాటతో ఈ సినిమా టాకీ పార్ట్‌తో పాటు మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. దీంతో ప్రస్తుతం చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై పూర్తి ఫోకస్ పెట్టింది.

వచ్చే సెప్టెంబర్ 24న ‘ది ప్యారడైజ్’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్‌ను కూడా భారీ స్థాయిలో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్నాయి. ఇక అనిరుధ్ రవిచందర్ అందిస్తున్న నేపథ్య సంగీతం సినిమాపై మరింత హైప్ పెంచుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

మరోవైపు వచ్చే వారం ‘ది ప్యారడైజ్’ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్‌తో సినిమా కథ, నాని పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామా కోసం టాప్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.

షూటింగ్ పూర్తవడంతో నాని కూడా త్వరలోనే ప్రమోషన్స్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ముఖ్యంగా సినిమా రిలీజ్‌కు ముందే USA అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ది ప్యారడైజ్’ అదరగొడుతోంది. ఇప్పటికే బుకింగ్స్‌లో మంచి జోరు కనిపిస్తుండటంతో, నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ఈ సినిమా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారీ అంచనాలు, నాని క్రేజ్, అనిరుధ్ మ్యూజిక్, గ్రాండ్ స్కేల్‌తో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా కావడంతో ‘ది ప్యారడైజ్’పై ఇండస్ట్రీలోనూ భారీ బజ్ ఉంది. మరి ఈ అంచనాలను అందుకుని బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore