Search
Close this search box.

  విజయ్ దేవరకొండకు ఈసారి హిట్ పక్కా..? రణబాలి టీజర్‌ ఎలా ఉందంటే..!

September 9, 2026 11:35 PM | Aditya369 News

విజయ్ దేవరకొండకు ఈసారి హిట్ పక్కా..? రణబాలి టీజర్‌ ఎలా ఉందంటే..!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తుండగా.. ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ మూవీ ‘రణబాలి’. బ్రిటిష్ పాలన కాలంలో రాయలసీమ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, కరువు, అణచివేత, పోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 16న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. తాజాగా విడుదలైన టీజర్ ఆ అంచనాలను మరింత పెంచేసింది. టీజర్‌లో చూపించిన విజువల్స్, విజయ్ దేవరకొండ మాస్ అవతార్, కథా నేపథ్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

1870ల కాలం నాటి రాయలసీమను టీజర్‌లో చూపించారు. ఒకవైపు తీవ్రమైన కరువు.. మరోవైపు ఆహారం కోసం ప్రజలను బ్రిటిష్ అధికారులు దోచుకోవడం, చిత్రహింసలకు గురిచేయడం వంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఆకలి, అన్యాయం, అణచివేతతో ప్రజలు అల్లాడుతున్న సమయంలో.. బ్రిటిష్ పాలకులకు ఎదురుతిరిగే వ్యక్తిగా ‘సింగనమల బొబ్బలి రణబాలి’ పాత్రలో విజయ్ దేవరకొండ కనిపిస్తున్నారు.

తన ప్రజల కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడే యోధుడిగా విజయ్ పాత్రను తీర్చిదిద్దినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా విజయ్ పలికిన రాయలసీమ యాసలోని డైలాగ్స్, ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.

ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ క్రూరమైన బ్రిటిష్ అధికారి పాత్రలో కనిపించనుండటం మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇక రష్మిక మందన్న ‘జయమ్మ’ పాత్రలో విజయ్‌కు జోడీగా కనిపించనున్నారు. ‘డియర్ కామ్రేడ్’ తర్వాత విజయ్–రష్మిక కాంబినేషన్ మళ్లీ తెరపై కనిపించనుండటంతో ఈ జంట అభిమానుల్లో కూడా ఆసక్తి నెలకొంది.

మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు అజయ్–అతుల్ సంగీతం అందిస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్, భారీ యాక్షన్ సన్నివేశాలు, బలమైన కథ, విజయ్ దేవరకొండ మాస్ పెర్ఫార్మెన్స్‌తో ‘రణబాలి’పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇటీవల విజయ్ నటించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోవడంతో.. ఇప్పుడు ‘రణబాలి’తో ఎలాగైనా బిగ్ హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే విజయ్ ఖాతాలో మరో భారీ విజయం చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరి అక్టోబర్ 16న దసరా కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ‘సింగనమల బొబ్బలి రణబాలి’ ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore