టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న రెండు ప్రాజెక్టులు షూటింగ్ దశలో ఉండగానే మరో కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఇటీవల శౌర్యావ్ దర్శకత్వంలో తన కొత్త సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగాయి.
పాన్ ఇండియా రేంజ్లో భారీ ప్లానింగ్
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్‌నే సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. పోస్టర్లో విజయ్ దేవరకొండ జంతువులతో కనిపించిన తీరు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించాలనే లక్ష్యంతో దర్శకుడు శౌర్యవ్ ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇందుకోసం బాలీవుడ్ నటీనటులతో పాటు హాలీవుడ్ టెక్నీషియన్లను కూడా రంగంలోకి దింపుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
విజయ్‌కు జోడిగా నేషనల్ అవార్డ్ విన్నర్?
ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాల్లో నటించి, నేషనల్ అవార్డు అందుకున్న కృతి సనన్‌కు ఈ కథ వినిపించగా, ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఒకవేళ ఇదే నిజమైతే, విజయ్ – కృతి కాంబో ప్రేక్షకులకు పూర్తిగా ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ అవుతుందని చెప్పాలి.
ఫ్యాన్స్‌లో మిక్స్డ్ రియాక్షన్స్
విజయ్ దేవరకొండకు జోడిగా కృతి సనన్ నటించబోతుందనే వార్తలపై అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు “ఇది ఫ్రెష్ కాంబో… స్క్రీన్‌పై అదిరిపోతుంది” అని కామెంట్లు చేస్తుంటే, మరికొందరు మాత్రం “ఈ జంట సెట్ అవుతుందా?” అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది.
విజయ్ లైన్అప్ మామూలుగా లేదు
ప్రస్తుతం విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన, రణబలి చిత్రాలతో బిజీగా ఉన్నారు.
‘రౌడీ జనార్ధన్’లో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుండగా, ‘రణబలి’లో రష్మికా విజయ్‌కు జోడిగా కనిపించనుంది. ముఖ్యంగా పెళ్లి తర్వాత విజయ్ – రష్మిక జంట తొలిసారి వెండితెరపై కనిపించనున్నారనే వార్తలు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి.








