కాకినాడ జిల్లా పిఠాపురం పుణ్యక్షేత్రం పాదగయ లో శివరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని ఆలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. విద్యుత్ కాంతులతో ఆలయం విరాజిల్లుతోంది. శివరాత్రి మహోత్సవాలు సందర్భంగా ఇక్కడ జరిగే పుష్కరిణిలోని పుణ్య స్నానాలకు లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు.









