టాలీవుడ్ నుంచి ఇటీవల విడుదలైన పీరియాడిక్ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రాల్లో యంగ్ హీరో విరాట్ కర్ణ నటించిన ‘నాగబంధం’ ఒకటి. దర్శకుడు అభిషేక్ నామా తెరకెక్కించిన ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటించారు. విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా థియేటర్లలో మిశ్రమ స్పందనను అందుకుంది.
అయితే టాక్ ఎలా ఉన్నా, ఈ చిత్రం ప్రారంభ వసూళ్లను బాగానే రాబట్టింది. థియేట్రికల్ రన్ అనంతరం ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్కు చేరుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 24 నుంచి ‘నాగబంధం’ స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా తెలుగు భాషతో పాటు తమిళం, మలయాళం, కన్నడ డబ్బింగ్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. హిందీ వెర్షన్ మాత్రం అందుబాటులో లేదు. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఈ చిత్రాన్ని చూడొచ్చు.








