గుంటూరులోని ఓ నగల దుకాణం నుండి సుమారు రూ.4 కోట్ల విలువైన 5 కేజీల బంగారం నగలు దోపీడికి గురయ్యాయి. మంగళగిరికి చెందిన దివి రాము అనే వ్యక్తి విజయవాడలో నగల దుకాణం నిర్వహి స్తున్నాడు. అతడి బంధువు నాగరాజు దుకాణంలో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి దుకాణం నుండి 5 కిలోల అభరణాలను సంచిలో వేసుకుని నాగరాజు స్కూటీపై మంగళగిరి ఆంజనేయకాలనీలో రాము ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో ఇద్దరు దుండగలు బైక్ పై వచ్చి తనను అడ్డుకుని నగలున్న సంచిని అపహరించారని నాగరాజు బంధువులకు సమాచారం ఇచ్చి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులకు నగలు అపహరణ పై అనుమానాలు వ్యక్తం చేశారు. నగలు అపహరించారా..మాయం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీపీ ఫుటేజీలను సేకరించి, ఫిర్యాది దారుడు నాగరాజు ఫోన్ కాల్స్ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.









