సామర్లకోట రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కుతూ జారిపడి యు కొత్తపల్లి మండలం ఉప్పాడ నాయకర్ కాలనీకి చెందిన వాకాడ జాన్ బాబు(27) మృతి చెందాడు.నూజివీడు వెళ్లేందుకు తన తండ్రి, భార్య, కుమారుడితో కలిసి జాన్ బాబు సామర్లకోట లో రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు.దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటనతో అక్కడే ఉన్న అతని తండ్రి,భార్య నిశ్చేష్టులయ్యారు.
