ఏపీ ప్రభుత్వం 2024-26 మద్యం రిటైలింగ్ పాలసీ పారదర్శకంగా అమలు చేయడంతో 90వేల అప్లికే షన్లకు ఫీజు కింద ప్రభుత్వానికి రూ1800 కోట్లు వచ్చాయి.వినియోగదారులకు అందుబాటు ధరలో నాణ్యమైన మద్యం అందించేందుకు క్వార్టర్ (180మి.లీ) బాటిల్ మార్కెట్ ధరను రూ.99గా నిర్ణయించారు.అయితే ప్రతి నెలకు మార్కెట్ షేర్ పెరిగిపోతూ ఉంది.మార్కెట్లో ఉన్న వివిధ మద్యం రేట్లను సమీక్షించి రిటైల్ ఎక్సైజ్ టాక్స్ ను సవరించడం జరిగింది.అందువల్ల ఫిబ్రవరి10,2025 నుండి సవరించిన మద్యం రేట్లు అమలులోకి వచ్చాయి.రిటైలర్ మార్జిన్ పెంచేందుకు కేవలం IMFL(ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్) బ్రాండ్లపై ఏ బాటిల్ అయినా రూ.10 మాత్రమే పెంచారు.క్వార్టర్ రూ.99కి అమ్మే బ్రాండ్లు, బీరు, వైన్, రెడీ టు డ్రింక్ లిక్కర్ పైనా ఎటువంటి పెంపు లేదు. క్వార్టర్‌కు రూ.30 వరకూ పెంచేసినట్టు కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అబద్దం.
