Search
Close this search box.

  250 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్ల అనుసంధానం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

250 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామానికి రోడ్లను అనుసంధానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. గురువారం ఆయన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు, ఏషియన్ ఇన్‌ప్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఏపీలో 7,213 కిలో మీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈ రోడ్ల నిర్మాణం కోసం రూ.4,976 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మ్యాచింగ్ గ్రాంట్ 10 శాతానికి తగ్గించేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని పేర్కొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు