కాకినాడ జిల్లా పిఠాపురం మండలం నరసింగపురం రోడ్డులో ఉన్న ఓ పశువుల మకాంలో అగ్ని ప్రమాదం సంభవించి మకాం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎక్కువ సంఖ్యలో గేదెలు, దూడలు మృతి చెందినట్లు చెబుతున్నారు. అగ్ని కీలలకు కొన్ని పశువులు చెల చెదురుగా పారిపోయాయి. అర్థరాత్రి దాటిన తర్వాత ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. అధికారులు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు.









