Search
Close this search box.

  కాకినాడ ఎంపీపై తిరుగుబాటుకి కార‌ణాలెన్నో..! ర‌ణం మొద‌లైంది పిఠాపురం నుండేనా..త‌ల‌లు ప‌ట్టుకుంటున్న జ‌న‌సేన నేత‌లు

November 24, 2026 11:03 AM | Aditya369 News

కాకినాడ ఎంపీపై తిరుగుబాటుకి కార‌ణాలెన్నో..! ర‌ణం మొద‌లైంది పిఠాపురం నుండేనా..త‌ల‌లు ప‌ట్టుకుంటున్న జ‌న‌సేన నేత‌లు

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు, జ‌న‌సేన‌కు బ‌ల‌మైన జిల్లాలో కాకినాడ ముందుంది. కూట‌మి నేత‌ల ఒప్పందం ప్ర‌కారం కాకినాడ జిల్లాలో మెజార్టీ స్థానాల‌న్ని జ‌న‌సేన కైవ‌సం చేసుకుంటుంది. దీనిపై టిడిపి నేత‌లు కొన్ని చోట్ల కినుక వ‌హిస్తున్నా.. ఎవ‌రికి ఇష్టం ఉన్నా..లేకున్నా టిడిపి అధిష్టానం జ‌న‌సేన కు అన్ని విధాలుగా కాకినాడ జిల్లాలో రూట్ క్లియ‌ర్ చేస్తోంది. ఇంత వ‌ర‌కూ బాగానే ఉన్న జ‌న‌సేన నేత‌లు ఈ ప‌ద‌వుల పంప‌కాల్లో స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డంలో మాత్రం పూర్తిగా విఫ‌ల‌మ‌వుతున్నారు. ఆ కోణంలోనే కాకినాడ ఎంపీ ఉద‌య్ శ్రీనివాస్ నిర్ణ‌యాలతో జ‌న‌సైనికులు తిరుగుబాటు చేస్తూనే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

తాజాగా పిఠాపురం మున్సిప‌ల్ వైస్ ఛైర్ ప‌ర్స‌న్ ఎన్నిక‌లో అభ్య‌ర్థి ఎంపికే జ‌న‌సేన‌కు పెద్ద స‌మ‌స్య‌ను తెచ్చిపెట్టింది. ప‌వ‌న్ క‌నుస‌న్న‌ల్లో పిఠాపురం ఉంది.ఏది జ‌రిగినా ప్ర‌త్య‌క్షంగా..ప‌రోక్షంగా జ‌న‌సేనాని ప్ర‌తిప‌క్షాల‌కు టార్గెట్ అయిపోతున్నారు. అయితే రాజ‌కీయంగా ప‌వ‌న్‌కు కాకినాడ నుండి త‌ప్పుడు స‌మాచారం ఇస్తున్నార‌నేది ఇక్క‌డ జ‌న‌సైనికుల బ‌ల‌మైన వాద‌న‌. జ‌న‌సేన అధిష్టానంలో ఉన్న కొద్ది మంది నేత‌ల‌తో ఎంపీ వ‌ర్గం ట‌చ్‌లో ఉండ‌టం, మిగిలిన నేతల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక‌పోవ‌డమే ఇందుకు కార‌ణ‌మ‌ని అంటున్నారు.

ఈ ప‌రిస్థితుల్లోనే పిఠాపురంలో మున్సిప‌ల్ వైస్ ఛైర్ ప‌ర్స‌న్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన కౌన్సిల‌ర్లు ఆవేశం క‌ట్ట‌లు తెంచుకుంద‌ని, జ‌న‌సైనికుల‌కు త‌మ పార్టీని కాపాడుకోవాల‌నే ఆవేద‌న వ్య‌క్త‌మైంద‌ని అంటున్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత వైసీపీ నుండి జ‌న‌సేన‌లోకి వ‌చ్చిన వారికి ప్రాధాన్య‌తనివ్వ‌డం పిఠాపురంలో ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణాన్ని తెచ్చిపెట్టింద‌ని జ‌న‌సైనికులు చెబుతున్నారు. ఎంతో కాలంగా ఉన్న వారిని విస్మ‌రించి, త‌మ అధినేత‌కు, అధినాయ‌క‌త్వానికి త‌ప్పుడు స‌మాచారం ఇచ్చి జ‌న‌సైనికుల‌ను ఎద‌గ‌కుండా చేస్తున్నార‌నేది ఇక్క‌డ వారి వాద‌న‌. జ‌న‌సేన‌లోని మిగిలిన నేత‌ల అభిప్రాయాల‌ను ఎంపీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌డం లేద‌ని, మొత్తం అంతా ఎంపీ మ‌యం అంటూ ఆ నేత‌లు సైతం చేతులు దులుపుకుంటున్నారు.

పిఠాపురం టార్గెట్‌.. ఎంపీపై తిరుగుబాటు అందుకేనా

దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేలా అభివృద్ధి చేస్తాన‌ని పిఠాపురం వాసుల‌కు మాట ఇచ్చిన ప‌వ‌న్ ఆ స్థాయిలోనే అభివృద్ధి ప‌నుల‌కు శ్రీకారం చుట్టారు. ఇక్క‌డ టార్గెట్ పిఠాపురం కావ‌డంతో జ‌న‌సేన‌లోని పెద్ద త‌ల‌కాయ‌లు పిఠాపురంపైనే ఎప్పుడూ దృష్టి పెట్టారు. ఈ కోవ‌లోనే ప్ర‌తీ నేత కూడా ప‌వ‌న్ దృష్టిలో ప‌డాల‌ని ఉత్సుక‌త‌తో ఉన్నారు. ఆయ‌న ప‌నుల‌న్ని మేము చూసుకుంటామ‌నే ప్ర‌చారం ఎవ‌రికి వారు చేసుకుంటున్నారు. ఇక్క‌డ స‌రియైన నాయ‌క‌త్వం లేక‌పోవ‌డంతో, ప‌లానా వ్య‌క్తే ప‌నులు చూసుకుంటారనే పరిధి లేక‌పోవ‌డం జ‌న‌సేన‌కు పెద్ద మైన‌స్‌గా మారింది.

జ‌న‌సేన జిల్లా నేత‌లు కూడా పిఠాపురాన్ని టార్గెట్‌గా చేసుకుంటున్నారు. దీంతో నేత‌ల మ‌ధ్య కూడా అంతరయుద్ధం మొద‌లైంది. ఎవ‌రికి వారు ప‌వ‌న్ దృష్టిలో ప‌డాల‌నే అత్యుత్సాహం జ‌న‌సైనికుల‌కు శాపంగా మారింద‌ని అంటున్నారు. ఇటీవ‌ల పిఠాపురం ఎంపీపీల ఎన్నిక‌లోనూ, అంత‌క‌ముందు ఎంపీటీసీలు, మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ల సీట్ల కేటాయింపు వ్య‌వ‌హారం మొత్తం కాకినాడ ఎంపీ కార్యాల‌యం కేంద్రంగా ఉండ‌టంతో, అంద‌రి దృష్టి ఎంపీపైనే ప‌డింది. మంచి జ‌రిగినా, చెడు జ‌రిగినా ఎంపీ ఖాతాలోకి వెళ్లిపోవ‌డంతో జ‌న‌సైనికులు ఎంపీని టార్గెట్ చేశార‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

పైగా ఎంపీ కూడా కొద్ది మంది వ్య‌క్తుల చెప్పుచేత‌ల్లోనే ఉండిపోవ‌డం, వారంతా గ‌తంలో వైసీపీ నుండి రావ‌డంతో ఎంపీ టార్గెట్ అయి పోయారు. ఈ నేపథ్యంలోనే త‌మ‌ను కాద‌ని, ఎంపీయే వైసీపీ నుండి వ‌చ్చిన అభ్య‌ర్థికి పిఠాపురం మున్సిప‌ల్ వైస్ ఛైర్ ప‌ర్స‌న్ ప‌ద‌వి ఇవ్వ‌డంతో ఆయ‌న‌పై తిరుగుబాటు చేశార‌ని అంటున్నారు. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌తో జ‌న‌సేన పార్టీ అధినాయ‌కులు సైతం త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు