Search
Close this search box.

  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అడివి శేష్ కొత్త సినిమా?

November 24, 2026 2:42 PM | Aditya369 News

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అడివి శేష్ కొత్త సినిమా?

టాలీవుడ్ హీరో అడివి శేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘డెకాయిట్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం ‘గూఢచారి 2’ (జి2)లో నటిస్తున్నారు. 2018లో విడుదలై ఘన విజయం సాధించిన ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హాష్మీ, వామికా గబ్బి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.

‘జి2’ షూటింగ్ పూర్తవుతున్న నేపథ్యంలో అడివి శేష్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో ఆయన ఓ సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే ఇద్దరి మధ్య చర్చలు పూర్తయ్యాయని, శేష్ కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమాలో నటించబోయే కథానాయిక ఎంపికపై చిత్ర బృందం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. హీరోయిన్ ఖరారైన తర్వాత ఈ నెలాఖరులోనే నిర్మాణ సంస్థతో పాటు సినిమా వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు