టాలీవుడ్ హీరో అడివి శేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం ‘గూఢచారి 2’ (జి2)లో నటిస్తున్నారు. 2018లో విడుదలై ఘన విజయం సాధించిన ‘గూఢచారి’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హాష్మీ, వామికా గబ్బి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం.
‘జి2’ షూటింగ్ పూర్తవుతున్న నేపథ్యంలో అడివి శేష్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ రవీంద్రన్తో ఆయన ఓ సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటికే ఇద్దరి మధ్య చర్చలు పూర్తయ్యాయని, శేష్ కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమాలో నటించబోయే కథానాయిక ఎంపికపై చిత్ర బృందం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. హీరోయిన్ ఖరారైన తర్వాత ఈ నెలాఖరులోనే నిర్మాణ సంస్థతో పాటు సినిమా వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.









