Search
Close this search box.

  RC17లో రామ్ చరణ్ సరసన సయ్యారా బ్యూటీ..?

November 19, 2026 11:11 PM | Aditya369 News

RC17లో రామ్ చరణ్ సరసన సయ్యారా బ్యూటీ..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కేందుకు సిద్ధమవుతోంది. ‘RC17’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుండటంపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

ప్రస్తుతం ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్ తెరకెక్కించనున్న సినిమా కావడం, ‘పెద్ది’ తర్వాత రామ్ చరణ్ చేయబోయే ప్రాజెక్ట్ కావడంతో RC17పై హైప్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

తొలుత ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ‘ధురంధర్’ ఫేమ్ సారా అర్జున్ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఆమెనే హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ హీరోయిన్ రేసులోకి మరో బాలీవుడ్ బ్యూటీ అనీత్ పడ్డా పేరు తెరపైకి వచ్చింది.

‘సయ్యారా’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనీత్ పడ్డాను RC17లో కథానాయికగా తీసుకోవాలని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీంతో రామ్ చరణ్‌కు జోడీగా సారా అర్జున్ నటిస్తుందా? లేక అనీత్ పడ్డా ఛాన్స్ దక్కించుకుంటుందా? అనే ఆసక్తికర చర్చ మొదలైంది. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారనే ప్రచారం కూడా వినిపిస్తోంది.

‘సయ్యారా’ సినిమాతో ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారిన అనీత్ పడ్డాకు యూత్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. తన సహజమైన నటన, అందం, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామకు ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు RC17 చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు సమాచారం. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే హీరోయిన్ ఎంపికతో పాటు ఇతర వివరాలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మొత్తానికి రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు ఫైనల్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సారా అర్జున్, అనీత్ పడ్డా ఇద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు