నందమూరి బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దాదా’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించడంతో నందమూరి అభిమానుల్లో అప్పుడే సందడి మొదలైంది. సాయంత్రం 4:48 గంటలకు ఈ సినిమా నుంచి తొలి పాటను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
‘ది కింగ్ ఆఫ్ ఖయాస్ ఈజ్ బ్రింగింగ్ ఏ మ్యూజికల్ స్టార్మ్’ అంటూ విడుదల చేసిన పోస్టర్‌తోనే ఈ పాటపై అంచనాలను భారీగా పెంచేశారు. ఇక బాలకృష్ణ సినిమాల్లో పాటలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ డ్యాన్స్ మూమెంట్స్ అభిమానులకు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాంటిది ఇప్పుడు దాదా నుంచి ఫస్ట్ సాంగ్ వస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండటం కూడా అంచనాలను పెంచుతోంది. గతంలో బాలకృష్ణ, తమన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ సినిమాల్లో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బాలయ్య ఎంట్రీలు, యాక్షన్ సన్నివేశాలకు తమన్ అందించిన మ్యూజిక్ థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించింది. దీంతో ఇప్పుడు ‘దాదా’ ఫస్ట్ సాంగ్‌లో తమన్ ఎలాంటి మాస్ బీట్స్‌తో మ్యాజిక్ చేయబోతున్నాడనే ఆసక్తి నెలకొంది.
ఇక ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు గోపీచంద్ మలినేని గతంలో బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’ వంటి సూపర్ హిట్ మాస్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
క్రిస్మస్ పండుగకు ముందు థియేటర్లలోకి రానున్న ‘దాదా’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. మొత్తానికి సాయంత్రం 4:48 గంటలకు విడుదల కానున్న ఫస్ట్ సింగిల్‌తో బాలయ్య అభిమానులకు అసలైన మాస్ ట్రీట్ అందుతుందేమో చూడాలి.









