Search
Close this search box.

  చందూ మొండేటికి బాలీవుడ్ బంపర్ ఆఫర్..! భన్సాలీతో భారీ ప్రాజెక్ట్..!

October 1, 2026 6:35 AM | Aditya369 News

చందూ మొండేటికి బాలీవుడ్ బంపర్ ఆఫర్..! భన్సాలీతో భారీ ప్రాజెక్ట్..!

‘తండేల్’ సినిమాతో నాగచైతన్యకు కెరీర్‌లో మంచి విజయాన్ని అందించిన దర్శకుడు చందూ మొండేటి.. ఇప్పుడు బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారట.

ఇప్పటివరకు తెలుగులో విభిన్నమైన కథలు, కాన్సెప్ట్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చందూ మొండేటి.. త్వరలోనే హిందీ చిత్రసీమలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
సంజయ్ లీలా భన్సాలీ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్ ఎంట్రీ?
దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘మహాకాళ్’తో చందూ మొండేటి బాలీవుడ్ డైరెక్టర్‌గా పరిచయం కానున్నట్లు సమాచారం.

ముఖ్యంగా ‘కార్తికేయ 2’ సినిమాలో చందూ మొండేటి చూపించిన టేకింగ్, పౌరాణిక అంశాలను తెరపై ఆవిష్కరించిన విధానం భన్సాలీకి నచ్చిందని.. అందుకే ‘మహాకాళ్’ వంటి భారీ పౌరాణిక డ్రామా బాధ్యతలను చందూకు అప్పగించినట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇక ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. కథ, విజువల్స్, పౌరాణిక అంశాలతో పాటు భన్సాలీ నిర్మాణ విలువలు కూడా సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

అయితే ‘మహాకాళ్’కు సంబంధించిన పూర్తి వివరాలు, నటీనటులు, షూటింగ్ తదితర అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరి తెలుగులో తనదైన మార్క్ చూపించిన చందూ మొండేటి.. బాలీవుడ్‌లో కూడా అదే మ్యాజిక్‌ను క్రియేట్ చేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore