Search
Close this search box.

  ‘హనుమాన్ అన్శ్’ తెలుగు రిలీజ్‌కు భారీ ట్విస్ట్..!

September 25, 2026 9:20 PM | Aditya369 News

‘హనుమాన్ అన్శ్’ తెలుగు రిలీజ్‌కు భారీ ట్విస్ట్..!

హిందీలో సంచలన విజయం సాధిస్తున్న లేటెస్ట్ డివోషనల్ మూవీ ‘హనుమాన్ అన్శ్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

భక్తి ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా హిందీ మార్కెట్‌లో మంచి వసూళ్లు సాధిస్తూ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఈ విజయంతోనే సినిమాను తెలుగులో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.

ముందుగా ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రిలీజ్‌కు కొన్ని రోజుల ముందు అనూహ్య కారణాలతో త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం రావడంతో.. తెలుగు రిలీజ్‌పై సందిగ్ధత ఏర్పడింది.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. తెలుగు సహా సౌత్ ఇండియా రిలీజ్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ రంగంలోకి దిగినట్లు సమాచారం.

గతంలో ‘మహావతార్ నరసింహ’ వంటి డివోషనల్ సినిమాకు సౌత్‌లో సపోర్ట్ చేసిన హోంబళే ఫిల్మ్స్.. ఇప్పుడు ‘హనుమాన్ అన్శ్’ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి హోంబళే ఫిల్మ్స్ ఎంట్రీతో ఈ సినిమా తెలుగు రిలీజ్ నిజంగానే ఖరారవుతుందా అనేది చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు