నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది!
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. మొదటి రోజే ఏకంగా రూ.88 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. బుధవారం జరిగిన ప్రీమియర్స్‌తో పాటు గురువారం ఫస్ట్ డే కలెక్షన్స్ కలిపి ఈ మార్క్‌ను దాటేసింది.
ఇక ఇది నాని కెరీర్లోనే ఆల్‌టైమ్ హయ్యెస్ట్ డే-1 ఓపెనింగ్గా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్, ఇతర భాషల్లోనూ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన కేంద్రాల్లో మార్నింగ్ షోల నుంచే హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించడంతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని నటనతో పాటు కథా నేపథ్యానికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళ మార్కెట్లలోనూ సినిమా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది.
వీకెండ్ కూడా రావడంతో.. అడ్వాన్స్ బుకింగ్స్ బలంగా ఉండటం కలెక్షన్స్ జోరును మరింత పెంచేలా కనిపిస్తోంది. మరి ‘ది ప్యారడైజ్’ ఫుల్ రన్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి!







