Search
Close this search box.

  ఎన్టీఆర్‌తో రాజమౌళి సోలో మూవీ..? సోషల్ మీడియాలో వైరల్..!

October 1, 2026 6:29 AM | Aditya369 News

ఎన్టీఆర్‌తో రాజమౌళి సోలో మూవీ..? సోషల్ మీడియాలో వైరల్..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కూడా ‘వారణాసి’ సినిమాతో మరోసారి ప్రపంచ స్థాయిలో తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.

అయితే ‘వారణాసి’ తర్వాత రాజమౌళి ఏ సినిమా చేయబోతున్నారు? అనే చర్చ ఇప్పటికే ఇండస్ట్రీలో మొదలైంది. రాజమౌళి లైనప్‌లో ‘బాహుబలి 3’, ‘RRR 2’ వంటి ప్రాజెక్టుల పేర్లు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.
తారక్‌తో జక్కన్న మరోసారి?
ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ క్రేజీ బజ్ వైరల్ అవుతోంది. రాజమౌళి–జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘RRR’ ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకుంది. అయితే ‘RRR 2’లో తారక్‌తో కలిసి పనిచేయడం కాకుండా.. ఎన్టీఆర్‌ను సోలో హీరోగా పెట్టి రాజమౌళి మరో సినిమా చేయబోతున్నారనే రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి.

ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే.. ‘RRR’ తర్వాత రాజమౌళి–తారక్ కాంబోపై ఉన్న అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతోంది.

అయితే ప్రస్తుతం వినిపిస్తున్నది కేవలం ఇండస్ట్రీ బజ్, రూమర్ మాత్రమే. రాజమౌళి లేదా ఎన్టీఆర్ వైపు నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మరి నిజంగానే ‘వారణాసి’ తర్వాత జక్కన్న.. తారక్‌తో మరోసారి చేతులు కలుపుతారా? లేక ఇది కేవలం రూమర్‌గానే మిగిలిపోతుందా? తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore