నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలైన తర్వాత తొలి మూడు రోజులు మంచి జోరు చూపించినా.. ప్రస్తుతం ఆంధ్ర, సీడెడ్ ఏరియాల్లో కలెక్షన్లు కాస్త డౌన్ అయినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నైజాంలో పరిస్థితి కొంత ఫర్వాలేదనిపిస్తున్నప్పటికీ.. సోమవారం నుంచి ఆంధ్ర, సీడెడ్ ఏరియాల్లో వసూళ్లు తగ్గినట్లు సమాచారం. ముఖ్యంగా కొన్ని ప్రధాన కేంద్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ కూడా కనిపించకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లలో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పుడు ‘ది ప్యారడైజ్’కు ఓ గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. ఈ శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా హాలిడే ఉండటంతో.. ఈ సెలవు సినిమాకు కలెక్షన్లు పెంచేందుకు ఉపయోగపడే అవకాశం ఉంది.
ఇదే వీకెండ్‌ను టార్గెట్ చేస్తూ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’, ‘సిగ్మా’ వంటి నాలుగైదు చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
అయితే వాటితో పోలిస్తే ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాగా ‘ది ప్యారడైజ్’కు ఎక్కువ స్కోప్ ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక కలెక్షన్లను మరింత పెంచేందుకు హీరో నాని కూడా ప్రమోషన్స్‌పై ఫోకస్ పెంచినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు, విజయవాడలోని థియేటర్లను స్వయంగా సందర్శిస్తూ ప్రేక్షకులను కలుస్తున్నారు.
మరి గాంధీ జయంతి హాలిడే, స్పెషల్ వీకెండ్ ‘ది ప్యారడైజ్’కు ఎంతవరకు కలిసొస్తాయి? తగ్గిన కలెక్షన్లను ఈ వీకెండ్‌లో సినిమా తిరిగి పుంజుకుంటుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.







