Search
Close this search box.

  ‘తెల్లకాగితం’ మూవీ లీక్..? టెన్షన్ లో మూవీ టీం..!

September 29, 2026 7:59 PM | Aditya369 News

‘తెల్లకాగితం’ మూవీ లీక్..? టెన్షన్ లో మూవీ టీం..!

అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాల్లో ‘తెల్లకాగితం’ కూడా ఒకటి. విడుదలకు ముందే ఈ సినిమాపై ఇండస్ట్రీలో మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే పలువురు దర్శకులు, నిర్మాతలకు ప్రత్యేకంగా సినిమా చూపించగా.. వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. బిజినెస్ పరంగానూ ఈ సినిమాపై ఆసక్తి ఉందనే టాక్ వినిపిస్తోంది.

అయితే రిలీజ్‌కు కేవలం మూడు రోజుల ముందు ‘తెల్లకాగితం’ టీమ్‌కు షాక్ ఇచ్చే పరిణామం చోటుచేసుకుంది. అర్థరాత్రి సమయంలో సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై వైరల్ అవుతున్నాయి.

లీకైనవి సాధారణ సీన్లు కాకుండా.. కథలో కీలకమైన ఎపిసోడ్లకు సంబంధించిన సన్నివేశాలుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇలాంటి కంటెంట్ ముందుగానే బయటకు రావడం సినిమాపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన చిత్రబృందంలో మొదలైనట్లు సమాచారం.

అంతేకాదు.. సినిమా మొత్తం టెలిగ్రామ్‌లో లీక్ అయిందనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే ఈ విషయం అధికారికంగా ధృవీకరించబడలేదు. ప్రస్తుతం లీకైన కంటెంట్, లింకులను గుర్తించి తొలగించే చర్యల్లో చిత్రబృందం నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

సినిమా విడుదలకు ముందు కీలక సన్నివేశాలు బయటకు రావడం వల్ల ప్రేక్షకుల ఆసక్తిపై ప్రభావం పడటంతో పాటు.. ఓటీటీ డీల్‌లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. ఈ లీక్ కావాలనే పబ్లిసిటీ కోసం చేశారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలోని ఓ వర్గం చేస్తోంది. అయితే దీనిపై కూడా ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. అసలు లీక్ ఎలా జరిగింది? ఎవరి వల్ల జరిగింది? సినిమా మొత్తం నిజంగానే లీక్ అయిందా? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో ‘తెల్లకాగితం’ చిత్రబృందం ఈ సాయంత్రం ఓ ప్రెస్ నోట్ విడుదల చేసి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ లీక్ వ్యవహారంపై టీమ్ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore